RCB vs DC: బెంగళూరులో విజయ పతాకం ఎగరేసిన కేఎల్ రాహుల్.. ఆర్సీబీపై ఢిల్లీ ఘన విజయం.. 4 d ago

IPL 2025 భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్ మహా ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరికి కేఎల్ రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్ తో ఢిల్లీకి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు విజయాలతో టోర్నీలో అజేయ జట్టుగా కొనసాగుతోంది. బెంగళూరుపై ఘన విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్ 2 ప్లేసులో ఉంది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ RCB ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మొదటి ఓవర్లలో RCB ఓపెనర్లు చెలరేగిపోయారు. మిచెల్ స్టార్క్ ఓవర్‌లో ఫిల్ సాల్ట్ ఏకంగా 30 పరుగులు చేసాడు.. అయితే 3 ఓవర్లు ముగిసేసరికి RCB 53/0 స్కోరు చేసింది.
ఈ దశలో RCB స్కోర్ 250 పరుగులు దాటేస్తుందేమో అనిపించింది. కానీ.. ఆ తర్వాత అనూహ్యంగా ఫిల్ సాల్ట్ (37) రనౌట్ కావడంతో.. RCB పతనం మొదలయింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోతూనే ఉంది. ఫిల్ సాల్ట్ రనౌట్ తరువాత పాడిక్కాల్ (1), కోహ్లీ (22), లివింగ్‌స్టోన్ (4), జితేష్ శర్మ (3) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. కెప్టెన్ రజత్ పటీదార్ కూడా 25 పరుగులకే వెనుతిరిగాడు. చివర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 రన్స్) మెరుపులు మెరిపించడంతో RCB.. 150 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు ఫాన్స్ కి షాక్ ఇచ్చారు. ఢిల్లీ ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్-మెగర్క్ (7) చేతులెత్తేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన పోరెల్ (7) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్ గెలవడం కష్టం అనుకున్న సమయంలో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడాడు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనాని కనపరిచాడు.
53 బంతుల్లో 7 ఫోరులు, 6 సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్ (38) కూడా రాహుల్ కు మంచిగా సపోర్ట్ ఇచ్చాడు. రాహుల్ దూకుడుతో 17.5 ఓవర్లలోనే RCB ఇచ్చిన టార్గెట్‌ను ఢిల్లీ చేధించగలిగింది. దీంతో RCB పై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెరుపు బ్యాటింగ్ ఆడిన కేఎల్ రాహుల్ మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.